అసైన్మెంట్ సమర్పణల్లో ChatGPT.. అడ్డుకట్టకు కొత్త చర్యలు!
- January 21, 2024
యూఏఈ: AI సాంకేతికతతో నడిచే ChatGPT మరియు ఇతర లాంగ్వేజీ ప్రాసెసింగ్ సాధనాలను విద్యార్థులు ఉపయోగించడం ఇటీవల బాగా పెరిగింది. వీటి సాయంతో కంటెంట్‌ను క్రియేట్ చేయడం, పరీక్షలను ఎదుర్కొవడానికి ఉపయోగిస్తున్న విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి విద్యాసంస్థలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎమిరేట్ లోని కొన్ని సంస్థలు జారీ చేసిన ల్యాప్‌టాప్‌లు, Wi-Fiలో ChatGPTని బ్లాక్ చేశాయి. మరికొన్ని సంస్థలు AI-మద్దతు ఉన్న అసైన్మెంట్ సమర్పణల సమస్యను పరిష్కరించడానికి వివిధ రకాల పద్ధతిని అమలు చేస్తున్నాయి. గల్ఫ్ మెడికల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వైస్ ఛాన్సలర్, అకడమిక్స్ మరియు డీన్ ప్రొఫెసర్ మందా వెంకట్రామన్ మాట్లాడుతూ.. ఈ సవాలును పరిష్కరించడానికి ప్లగియరిజం చెకర్స్ వంటి వివిధ సాధనాలు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు సిస్టమ్ ద్వారా కాపీ చేసిన వర్క్ ని శాతాన్ని అంచనా వేయగల సాఫ్ట్వేర్ ల సాయంతో అడ్డుకుంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అసైన్మెంట్లపై ChatGPT ప్రభావాన్ని తగ్గించడంలో ఈ సాధనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ మాట్లాడుతూ.. పాఠశాలలో ChatGPT అకడమిక్ సమగ్రతకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతుందని తెలిపారు. తమ పాఠశాలలో AI మద్దతు ఉన్న అసైన్మెంట్ సమర్పణల సవాలును అధిగమించడానికి తాము విద్యార్థులకు తగిన సూచనలను ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు