అబుదాబిలో మరణ ధృవీకరణ పత్రం, ఖనన విధానాలు సరళీకృతం

- January 21, 2024 , by Maagulf
అబుదాబిలో మరణ ధృవీకరణ పత్రం, ఖనన విధానాలు సరళీకృతం

యూఏఈ: అబుదాబిలో ఏడు ప్రభుత్వ సంస్థల సేవలను డిజిటల్‌గా మార్చింది. దీంతో మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడం, ఖననం కోసం ఏర్పాటు చేయడంతో సహా మరణించిన కుటుంబాల కోసం విధానాలను సులభతరం చేయనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ - అబుదాబి (DoH) సనద్‌కోమ్ ఈ చొరవను ఆవిష్కరించింది.ఇది అబుదాబి ప్రోగ్రామ్ ఫర్ ఎఫర్ట్‌లెస్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో భాగంగా తీసుకొచ్చారు. మొదటి దశలో మరణించిన యూఏఈ జాతీయుల కుటుంబాలకు సేవలను అందిస్తుంది. తరువాతి దశలో ఇది ఎమిరేట్‌లోని నివాసితులందరినీ సేవలను విస్తరిస్తుందని DoH అండర్ సెక్రటరీ డాక్టర్ నౌరా ఖమీస్ అల్ ఘైతి తెలిపారు. ఏ ప్రభుత్వ విభాగాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను అందించేలా ఫోన్ ద్వారా ఒక్కో కేసు ఆధారంగా మృతుల కుటుంబాలకు మద్దతు, సహాయాన్ని అందించడానికి ఉమ్మడి ప్రభుత్వ సహాయక బృందాన్ని నియమించనున్నట్లు తెలిపారు. ఇది మరణ ధృవీకరణ పత్రాన్ని పొందడం, మరణించిన వ్యక్తి ఖననం, బీమా చేసిన లేదా వారి తరపున లబ్ధిదారులకు పదవీ విరమణ పెన్షన్ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి అవసరమైన అన్ని మరణ సంబంధిత లావాదేవీలను పూర్తి చేయడంలో కుటుంబాలకు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటూ సహాయాన్ని అందిజేస్తారని వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com