లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్
- January 21, 2024
లండన్: జనవరి 21 దావోస్ నుంచి లండన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు. లండన్ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తాజాగా సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను సందర్శించారు. లండన్లో ప్రపంచ ప్రసిద్ధమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక కట్టడాలను, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు. బిగ్బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను సీఎం తిలకించారు.
ఆ దేశ పురోగతి, ఆర్థికా భివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను సీఎం అడిగి తెలుసు కున్నారు.తెలంగాణలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో సీఎం అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర పర్యాటక రంగానికి వచ్చే గుర్తింపు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పరోక్షంగా లభించే ఉపాధి అవకాశాలు, ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దడానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత తదితరాలపై అధ్యయం చేశారు.
అలాగే లండన్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ఆయన ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఓఎస్డి అజిత్ రెడ్డి, మునిసిపల్ శాఖ కార్యదర్శి దాన కిషోర్, హెచ్ఎండిఏ, జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు ఉన్నారు..
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …