ఏపీసీసీ కార్యాలయంలో సిద్ధమైన షర్మిల ఛాంబర్
- January 21, 2024
విజయవాడ: ఏపీసీసీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిలకు ఏపీసీసీ కార్యాలయంలో ఛాంబర్ సిద్ధమైంది. అలాతే ఆంధ్రరత్న భవన్లో షర్మిలకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఛాంబర్ వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను ఈరోజు చేపడుతున్న నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, షర్మిళ ఫోటోలు ఏర్పాటు చేశారు.
కాగా వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. భారీ ర్యాలీగా విమానాశ్రయం నుంచి సభా వేదిక వద్దకు షర్మిల చేరుకోనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు మాణిక్యం ఠాగూర్, మునియప్పన్, కృష్టఫర్ తిలక్, ఏపీసీసీ కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరవుతారు.
వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళతారు. కానూరులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర రత్న భవన్ పీసీసీ కార్యాలయానికి వచ్చి.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి షర్మిల హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







