'హలో ఆసియా'తో సాంస్కృతిక కేంద్రంగా లుసైల్ బౌలేవార్డ్‌

- January 21, 2024 , by Maagulf
\'హలో ఆసియా\'తో సాంస్కృతిక కేంద్రంగా లుసైల్ బౌలేవార్డ్‌

దోహా : AFC ఆసియా కప్‌లో పాల్గొనే 24 దేశాల గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలకు  "హలో ఆసియా" ప్రధాన వేదికగామారింది. దీంతో లుసైల్ బౌలేవార్డ్ ఆసియాలోని శక్తివంతమైన కలర్స్, సౌందడ్స్, టేస్టులతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆసియాలోని విభిన్న సంస్కృతులు,  సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి సందర్శకులకు "హలో ఆసియా" గేట్‌వేగా మారింది. థాయ్‌లాండ్‌లోని ఒక ప్రత్యేకమైన పెవిలియన్.. సందర్శకులకు థాయ్ వాస్తుశిల్పం, సాంప్రదాయ వాయిద్యాలు,  ఐకానిక్ టుక్ టుక్ లేదా సామ్‌లోర్-మూడు చక్రాలు కలిగిన మోటరైజ్డ్ రిక్షా గురించి తెలియజేసింది. ఖతార్‌లోని థాయ్‌లాండ్ రాయబారి HE సిరా స్వాంగ్‌సిల్పా సందర్శకులకు ఆహ్వానం పలికారు.   వీటితోపాటు ఆకర్షణీయమైన పరేడ్ లు, ఉత్సాహభరితమైన మార్కెట్లు, జాతి వంటకాలు, రంగురంగుల జానపద ప్రదర్శనలతో గరుడ అభిమానులను అలరిస్తుంది. లుసైల్ బౌలేవార్డ్ వద్ద ఉన్న కంట్రీ జోన్ 1.3 కి.మీ విస్తీర్ణంలో జపాన్, వియత్నాం, కొరియా, ఇండియా, చైనా, పాలస్తీనా, ఖతార్, యూఏఈ, సిరియా మరిన్ని దేశాలతో సహా విభిన్న శ్రేణి దేశాల పెవిలియన్ లను ఏర్పాటు చేచారు.    బౌలేవార్డ్ డార్ట్ జోన్.. రోజువారీ రోమింగ్ షోలు, పరేడ్‌లు, డ్యాన్స్ మరియు సంగీత ప్రదర్శనలు, స్టేజ్ యాక్ట్‌లు, మ్యాజిక్ ట్రిక్స్, స్టిల్ట్ వాకర్స్, ఫేస్ పెయింటింగ్ మరియు వర్చువల్ రియాలిటీ ఆర్కేడ్‌తో సహా అనేక రకాల కుటుంబ-స్నేహపూర్వక కార్యకలాపాలను అందిస్తుంది. "హలో ఆసియా" వేడుక లుసైల్ స్టేడియంలో మ్యాచ్ రోజులను మినహాయించి ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతుంది. ఇది సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com