రియాద్‌లో జాయ్ అవార్డ్స్-2024: అవార్డులు అందుకున్న ప్రముఖ నటులు

- January 22, 2024 , by Maagulf
రియాద్‌లో జాయ్ అవార్డ్స్-2024: అవార్డులు అందుకున్న ప్రముఖ నటులు

రియాద్: రియాద్‌లో ఘనంగా స్టార్-స్టడెడ్ జాయ్ అవార్డ్స్ 2024 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచంలోని సినీ స్టార్స్ ను ఒక్కవేదికపై తీసుకొచ్చింది. రాజ్యాన్ని ఒక ప్రధాన సాంస్కృతిక మరియు పర్యాటక కేంద్రంగా స్థాపించాలనే లక్ష్యంలో భాగంగా జాయ్ అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ (GEA) ఛైర్మన్ టర్కీ అల్ షేక్ వెల్లడించారు. లెజెండరీ హాలీవుడ్ నటుడు ఆంథోనీ హాప్‌కిన్స్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.  సినిమా, టెలివిజన్‌కు చేసిన సేవలకు గానూ ప్రతిష్టాత్మకమైన పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవా లాంగోరియా అందుకున్నారు.  సౌదీ అరేబియా గాయకుడు రబెహ్ సాగర్,  నటుడు అలీ అల్-ఎమ్‌డిఫా జీవితకాల సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. లెబనీస్ ఫ్యాషన్ డిజైనర్ ఎలీ సాబ్, సిరియన్ నటి మోనా వాసెఫ్ మరియు అమెరికన్ నటులు కెవిన్ కాస్ట్నర్,  మార్టిన్ లారెన్స్ కూడా అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో సౌదీ అరేబియా ప్రస్తానాన్ని కెవిన్ కాస్ట్నర్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో ఈజిప్షియన్ గాయని షిరీన్ అబ్దుల్ వహాబ్, అమెరికన్ సింగర్ బెబె రెక్షల ఇచ్చిన ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com