దుబాయ్‌లో ప్రతిరోజూ 500 చెట్లను నాటిన అథారిటీ
- January 22, 2024
యూఏఈ: గత సంవత్సరం నగరంలో 185,000 కంటే ఎక్కువ చెట్లను నాటినట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. ప్రతిరోజు సగటున 500చెట్లను నాటింది. దీంతో 234 హెక్టార్లలో గ్రీనరీని అథారిటీ పెంచింది. ఇది 2022లో 170 హెక్టార్లుగా ఉంది. రోడ్లు మరియు ఉద్యానవనాలు సహా 210 ప్రదేశాలలో చెట్లను నాటారు. స్థానిక రకాల్లో ఘఫ్, సిద్ర్, సుమర్, వేప, ఆలివ్, సమోరోవా పామ్, ఇండియన్ జాస్మిన్ మరియు తాటి చెట్లను నాటినట్లు అథారిటీ తెలిపింది. అలాగే ఆకుపచ్చ ఆకులకు ప్రసిద్ధి చెందిన చెట్లలో వాషింగ్టోనియా, బిస్మార్కియా, సూడోబాంబాక్స్, పోయిన్సియానా, బౌగెన్‌విల్లె, అకేసియా ఫర్నేసియానా మరియు డార్సినా వంటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ తెలిపారు. పచ్చని ప్రదేశాలు పర్యావరణ పరిరక్షణతోపాటు నివాసితులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందజేస్తాయన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!