మహారాష్ట్ర సంఘటన పై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
- May 31, 2016
మహారాష్ట్రలోని పుల్గావ్ ఆయుధాగారంలో మంటలు, పేలుళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్‌ను వెంటనే అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కూడా పుల్గావ్కు బయల్దేరారు. అక్కడ మంటలు, పేలుళ్లలో దాదాపు 20 మంది మరణించి, మరో 19 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే.తనకు తెలిసిన సమాచారం ప్రకారం మంటలు అదుపులోకి వచ్చాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. అక్కడకు కావల్సిన సహాయం, వనరులు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అన్నీ అం దిస్తున్నామన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, భారీ మొత్తంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఎంతవరకు వీలైతే అంత సాయం చేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.
తాజా వార్తలు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!









