ఎయిరిండియాలోకి కొత్త ఎయిర్‌బస్ ఎ350-900
- January 22, 2024
న్యూఢిల్లీ: ఎయిరిండియా కొత్తగా కొనుగోలు చేసిన ఎయిర్‌బస్ ఎ350-900 వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ విమానాన్ని దేశంలోనే తొలిసారి ఎయిరిండియా ప్రవేశపెట్టింది.
హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా -2024లోనూ ప్రదర్శించింది. దీంతో సోమవారం బెంగళూరు, ముంబయిల మధ్య సేవలను ప్రారంభించింది. ఎఐ589 ప్లయిట్ నెంబర్‌తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 7.05 గంటలకు ప్రారంభమై.. 8.50 గంటలకు ముంబయికి చేరుకుంది. తదుపరి దశల్లో చెన్నరు, ముంబయి, హైదరాబాద్ సేవలకు ఉపయోగించనుంది. డిజిసిఎ అనుమతుల తర్వాత తదుపరి అంతర్జాతీయ సర్వీసులకు వినియోగించనుంది. ఇందులో 28 ప్రయివేటు బిజినెస్ సూట్‌లు సహా మొత్తం 350 సీట్లు ఉన్నాయి. ఈ విమానంతో 20 శాతం ఇంధనం ఆదా కానుందని ఇటీవల ఎయిర్‌బస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







