స్వదేశానికి హత్యకు గురైన భారతీయ ప్రవాసుడి మృతదేహం
- January 24, 2024
యూఏఈ: యూఏఈలో హత్యకు గురైన భారతీయ ప్రవాసుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. కొన్నేళ్లుగా స్థానిక టెక్స్‌టైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ విన్సెంట్ ఈ నెల ప్రారంభంలో కనిపించకుండా పోయాడు. "అతను 35 సంవత్సరాలుగా ఒక కంపెనీకి PRO గా పని చేస్తున్నాడు. జనవరి 2వ తేదీన రస్ అల్ ఖోర్‌లోని కంపెనీ నుంచి కనిపించకుండా పోయాడు." అని భారతీయ సామాజిక కార్యకర్త నసీర్ వాటనపల్లి చెప్పారు. అనిల్ కొడుకు భారతదేశం నుండి దుబాయ్ వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. జనవరి 12న అనిల్ మృతదేహాన్ని గుర్తించారు. అతని మృతదేహం షార్జాలోని మారుమూల ఎడారిలో గుర్తించారు. ఓ గొడవలో గాయపడి అనిల్ మరణించాడని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కొంత మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ వారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కేసు ఇంకా విచారణలో ఉందిని వివరించారు. 59 ఏళ్ల మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఛాతీపై గాయాలు, గొంతు నులిమి చంపినట్లు ఎంబామింగ్ సర్టిఫికేట్ లో పేర్కొన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









