4 ఏళ్ళ కూతుర్ని చంపి, ఫ్రిజ్‌లో దాచిన కసాయి

- May 31, 2016 , by Maagulf
4 ఏళ్ళ కూతుర్ని చంపి, ఫ్రిజ్‌లో దాచిన కసాయి

కువైట్‌కి చెందిన ఓ వ్యక్తి తన 4 ఏళ్ళ కుమార్తెను అతి కిరాతకంగా చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో దాచిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కువైట్‌ సిటీలోని సల్మియా ప్రాంతంలో జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో, రంగంలోకి దిగిన పోలీసు అధికారుల బృందం విచారణను చేపట్టింది. సలెమ్‌ బౌహన్‌ అనే 26 ఏళ్ళ వ్యక్తి, తన కుమార్తె ఇస్రాని ఎలక్ట్రికల్‌ వైర్‌తో దారుణంగా కొట్టాడు, అనంతరం ఆమెపై వేడి నీళ్ళు పోశాడు. ఇదంతా ఆమె తల్లి చూస్తుండగానే జరిగింది. ఫోరెన్సిక్‌ వైద్యులు పసిపాపను అతి కిరాతకంగా హింసించిన దాఖలాలున్నాయని తెలిపారు. విచారణలో నిందితుడు, డ్రగ్‌ ఎడిక్ట్‌గా తేలింది. తాను వాడే డ్రగ్‌ పిల్‌ని తీసుకోవడం ద్వారా పాప చనిపోయిందని పోలీసులకు తొలుత నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంట్లో తాను చెప్పినమాట వినలేదన్న కోపంతో ఆ పాపని కొట్టాననీ, ఆ తర్వాత ఆమె ఒంటిపై గాయాలు చూసి, మందులు తీసుకొచ్చి ఆమెకు రాయాలనుకున్నాననీ అప్పటికే ఆ పాప చనిపోయిందని వివరించాడు నిందితుడు తన నేరాన్ని. పాప చనిపోయిందని తెలుసుకున్నాక మార్కెట్‌కి వవెళ్ళి ఫ్రీజర్‌ కొనుక్కొచ్చి, అందులో ఆ పాపని ఉంచాడు. ఆ ఇంట్లో ఉండటానికి మృతురాలి తల్లి అంగీకరించకపోవడంతో, ఆమెతోపాటు మరో ముగ్గురు పిల్లల్ని వేరే ఫ్లాట్‌కి మార్చాడు నిందితుడు. పాపను చంపిన తండ్రితోపాటు, ఆ సమయంలో అక్కడే ఉన్న మృతురాలి తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాప తల్లితండ్రులిద్దరూ డ్రగ్స్‌ సేవించేవారని అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com