ఆస్ట్రేలియా బీచ్‌లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి

- January 25, 2024 , by Maagulf
ఆస్ట్రేలియా బీచ్‌లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి

ఆస్ట్రేలియా బీచ్‌లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా లో బీచ్‌కు వెళ్లిన నలుగురు భారతీయులు నిటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్‌ ఐలాండ్‌కు చెందిన బీచ్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు. ఈ ఘటనపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ స్పందించింది. ఘటనకు గానూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com