‘ఈగల్’ పరిస్థితి ఇలా అయ్యిందేంటబ్బా.!

- January 25, 2024 , by Maagulf
‘ఈగల్’ పరిస్థితి ఇలా అయ్యిందేంటబ్బా.!

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సినిమాల్లో ‘ఈగల్’ ఒకటి. సోలో రిలీజ్ అనే ఒప్పందంతో నిర్మాతల మండలి ఇచ్చిన వాగ్థానంతో సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుంది.
ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా సోలో రిలీజ్‌కి సిద్ధమైంది. అయితే, సందట్లో సడేమియా అన్నట్లుగా ఇదే డేట్‌కి సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా లైన్‌లోకి వచ్చింది.
మామూలుగా అయితే, సందీప్ కిషన్‌ని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఈ సినిమా ప్రోమోలు ఆసక్తికరంగా వుండడం.. రెస్పాన్స్ హ్యూజ్ రేంజ్‌లో వస్తుండడంతో ‘ఈగల్’ నిర్మాతలు ఈగో ఫీలవుతున్నారట.
ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవాలని వాదనకు దిగుతున్నారట. అయితే, ‘భైరవకోన’ మేకర్లు సైతం వెనక్కి తగ్గేలా లేరంటున్నారు.
ముందుగానే ఈ డేట్‌ని మేం లాక్ చేసుకున్నాం. సో మేం తగ్గేదే లే.! అంటున్నారట. ఇలా ఈగల్, భైరవకోన మేకర్ల మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. చూడాలి మరి, ఎవరైనా తగ్గుతారా.? లేదంటే.. నువ్వా నేనా.? అని బాక్సాఫీస్ వద్ద పోటీ పడతారా.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com