విజటర్స్ ఎంట్రీ కోసం ఆటోమేటెడ్ గేట్ల వద్ద బార్‌కోడ్‌ స్కానర్లు

- January 26, 2024 , by Maagulf
విజటర్స్ ఎంట్రీ కోసం ఆటోమేటెడ్ గేట్ల వద్ద బార్‌కోడ్‌ స్కానర్లు

రియాద్: ప్రవక్త మసీదు ఏజెన్సీ , సంబంధిత అధికారులు మదీనాలోని ప్రవక్త మసీదు వద్ద రౌదా షరీఫ్‌ను సందర్శించడానికి కొత్త సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇకపై రౌదా షరీఫ్‌లోకి ప్రవేశించడానికి సందర్శకులు ఆటోమేటెడ్ గేట్ల వద్ద బార్‌కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. రౌదా సందర్శనకు సంబంధించిన విధానాలు తప్పనిసరిగా నుసుక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అప్లై చేసుకోవాలని ఏజెన్సీ పేర్కొంది.  అప్లికేషన్ ద్వారా రిజర్వేషన్ చేసిన తర్వాత సందర్శకుడు అపాయింట్‌మెంట్‌ను నిర్ధారిస్తూ మెసేజ్ ను అందుకుంటారు. తరువాత, సందర్శకుడికి సందర్శన తేదీకి 24 గంటల ముందు అపాయింట్‌మెంట్ గురించి మరోసారి గుర్తుచేస్తారు. విజిటర్ నిర్ధిష్ట సమయానికి ముందు సందర్శన కోసం బార్‌కోడ్‌ను ఉపయోగించడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. రౌదా షరీఫ్‌కు చేరుకోవడానికి ముందు, సందర్శకుడు బార్‌కోడ్‌ను ఆటోమేటెడ్ గేట్ల ద్వారా స్కాన్ చేసి, ఆపై వేచి ఉండే ప్రదేశానికి వెళ్లి, ఆపై ప్రవేశం పొందాల్సి ఉంటుంది. సందర్శకుల సంఖ్యను తెలుసుకోవడానికి స్మార్ట్ కెమెరాలు, సెన్సార్‌ల ద్వారా పనిచేసే అధునాతన డిజిటల్ సిస్టమ్‌ల ద్వారా కూడా ఫాలో-అప్ చేయబడుతుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com