ఎన్టీయార్ - హృతిక్ రోషన్ ‘వార్’కి సర్వం సిద్ధం.!

- January 30, 2024 , by Maagulf
ఎన్టీయార్ - హృతిక్ రోషన్ ‘వార్’కి సర్వం సిద్ధం.!

భారీ ప్యాన్ ఇండియా సినిమాగా ‘వార్ 2’ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబర్ స్టార్ అనిపించుకున్న జూనియర్ ఎన్టీయార్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

ఎప్పుడో ఫార్మల్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మార్చి నుంచి ఎన్టీయార్, హృతిక్ రోషన్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.

ప్రస్తుతం ఎన్టీయార్ ‘దేవర’ షూటింగ్‌తో బిజీగా వున్నారు. మార్చి నుంచి ‘వార్ 2’ కోసం డేట్స్ కేటాయించాడట ఎన్టీయార్. మార్చిలో చేయబోయే షెడ్యూల్‌లో ఎన్టీయార్, హృతిక్ రోషన్‌తో పాటూ, సినిమాలోని కీలక పాత్రధారులు కూడా పాల్గొనబోతున్నారట.

అన్నట్లు ఈ సినిమాలో ఎన్టీయార్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటించబోతున్నాడనీ తెలుస్తోంది. సో, ఎన్టీయార్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ‘వార్ 2’ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. మరి, యాక్షన్ హీరోగా పేరున్న హృతిక్ రోషన్‌తో పోటీ పడి ఎన్టీయార్ యాక్షన్ ఎలా వుండబోతోందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com