మార్చి 3 నుండి మస్కట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్..షారుఖ్ ఖాన్‌కు సత్కారం
- January 31, 2024
మస్కట్: మార్చి 3 నుండి 7 వరకు జరగనున్న మస్కట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పదకొండవ సెషన్ వివరాలను మస్కట్‌లోని ఒమానీ ఫిల్మ్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించారు. ఈ ఫెస్టివల్లో ఫిక్షన్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు, ఒమానీ షార్ట్ ఫిక్షన్ ఫిల్మ్‌లు, ఒమానీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ల పోటీతో సహా వివిధ రంగాలలో అనేక పోటీలు ఉంటాయని తెలిపారు. అలాగే సెమినార్లు, వర్క్‌షాప్‌లు మరియు ప్రొడక్షన్ కంపెనీలకు ఉన్న ఫెస్టివల్ సౌక్ (మార్కెట్)తో సహా అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. ఈ ఫిల్మ్ ఉత్సవంలో ఐదు రోజుల పాటు పలువురు సినీ దర్శకులు, సినీ తారలను సత్కరిస్తారు. భారతీయ నటుడు- నిర్మాత షారుఖ్ ఖాన్, ఇరాన్ నుండి దర్శకుడు సతారా, ఈజిప్ట్ నుండి నెల్లీ కరీం, కువైట్ నుండి హోడా హుస్సేన్, ఒమన్ నుండి అబ్దుల్లా హబీబ్, మొహమ్మద్ అల్ కిండి, బుతైనా అల్ రైసి, తగ్లుబ్ అల్ బర్వానీ, ఖలీల్ అల్ సినానీతో పాటు బహ్రెయిన్ నుండి డైరెక్టర్ యాకూబ్ అల్ మక్లా, పాలస్తీనా నుండి డైరెక్టర్ మహ్మద్ బక్రీలను ఘనంగా సత్కరించనున్నారు. ఈ ఫెస్టివల్లో స్థానిక మరియు అంతర్జాతీయ సినిమా పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారిని ఒకే తాటిపైకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







