జిల్లాలో నేటి నుంచి పది శాఖల్లో ఈ ఆఫీసు సేవలు
- May 31, 2016
జిల్లాలోని పది శాఖల్లో ఈ ఆఫీస్ సేవలు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ విధానం తీసుకొస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఎలా పని చేస్తుంది అన్ని కార్యాలయాల్లో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులన్నీ స్కానింగ్ చేసి కంప్యూటర్‌లో ఫీడ్ చేస్తారు. వీటిని సంబంధిత అధికారికి పంపుతారు. ఈ దరఖాస్తు కొన్ని సెకన్లకే సంబంధిత అధికారి ముందుకు వెళుతుంది. అన్ని స్థాయిల్లో ఫైలు ఎవరు ఆలస్యం చేస్తున్నారో స్పష్టంగా గుర్తించవచ్చు. ఆర్టీఏ యాక్ట్ తదితర అదనపు పనులు వేగవంతంగా పూర్తి చేయవచ్చు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశల్లో ఉందో ముఖ్యమంత్రి నుంచి అన్ని స్థాయిల అధికారులు తెలుసుకోవచ్చు.జిల్లాలో ఎప్పటి నుంచి.. జిల్లాలో నేటి నుంచి పది శాఖల్లో ఈ ఆఫీసు ప్రారంభించాలని తొలుత జిల్లా అధికారులు భావించారు. కానీ డిజిటల్ సిగ్నేచర్ ఇతర సాంకేతిక కారణాలతో మరో నెల ఆలస్యమయ్యేలా ఉంది.డీఆర్వో నాగబాబు, ఈ ఆఫీస్ జిల్లా కో-ఆర్డి నేటర్ ఇప్పటికే రెవెన్యూలో ఈ ఆఫీస్ ప్రారంభమైంది. దీంతో జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం వేగవంతమైంది. కొద్ది రోజుల్లో అన్ని ఆటంకాలు అధిగమించి 10 శాఖల్లో ఈ ఆఫీస్ ప్రారంభిస్తాం. ఈ విధానంలో ఏవైనా లోటుపాట్లను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







