డాక్టర్ల రిటైర్మెంట్ వయసును 65 ..
- May 31, 2016
కేంద్ర వైద్య సేవల్లో ఉన్న డాక్టర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా మంగళవారం స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 4వేల మంది డాక్టర్లకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 'కేంద్ర ప్రభుత్వ సేవల్లో ఉన్న డాక్టర్ల రిటైర్మెంట్ వయసును 65 పెంచాలని నిర్ణయించాం. మే 31, 2016 నుంచి ఇది అమల్లోకి వస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు.ఈ నిర్ణయం కారణంగా.. తమ దగ్గరున్న అనుభవజ్ఞులైన వైద్యుల నాణ్యమైన సేవలను మరికొంత కాలం దేశానికి అందించే అవకాశం దక్కిందని మరో ట్వీట్లో ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రెండేళ్ల వేడుకల సందర్భంగా..మే 26న సహరాన్పూర్లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. వారం రోజుల్లో కేంద్ర కేబినెట్ దీనిపై ప్రకటన చేస్తుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఈ నిర్ణయం వెలువడినట్లు జేపీ నడ్డా తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం కోసం దేశాలను ఏకం చేయాలి: మోదీ ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదంపై పోరులో వివిధ దేశాలను ఏకం చేయాల్సిన బాధ్యతను దౌత్యవేత్తలే తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో ఐదురోజులుగా జరుగుతున్న హెడ్స్ ఆఫ్ డిప్లొమాట్స్ సదస్సులో చివరి రోజైన మంగళవారం ఆయన హాజరయ్యారు. 'దౌత్యపరమైన విషయాల్లో మనం కొత్త శకంలోకి అడుగుపెట్టాం. ఇకపై భారత ఆకాంక్షలను ప్రపంచవ్యాప్తం చేయాలి' అని పేర్కొన్నారు. దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయటంలో దౌత్యవేత్తల పాత్ర కీలకమన్నారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ప్రపంచంలోని మెజారిటీ దేశాలకు చాలా అవసరమని దీనికి మనమే నాయకత్వం వహించాలని చెప్పారు. విదేశాంగ విధానం, ప్రభుత్వ కార్యక్రమాలు, వివిధ దేశాలతో భారత ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై ఈ సదస్సులో చర్చించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







