తెలంగాణలో డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్..
- June 01, 2016
పత్రికా ప్రకటన 28-05-16 తెలంగాణలో ప్రఖ్యాత హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ డ్రీమ్ వర్క్స్ థీమ్ పార్క్
హైదరాబాద్ లో హై ఎండ్ ఎకో సిస్టమ్ థియేటర్ ఏర్పాటుఅద్భుతమైన విజన్ ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామన్న డ్రీమ్ వర్క్స్ టీ హబ్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిన లాస్ ఏంజెల్స్ క్లీన్ టెక్ ఇన్ క్యుబేటర్ ఐదో రోజు లాస్ ఏంజెల్స్ లో విజయవంతమైన మంత్రి కె.తారకరామారావు పర్యటనఅద్భుతమైన విజన్ ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకొస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన డ్రీమ్ వర్క్స్ ,తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంచుకుంది.అమెరికా టూర్ లో భాగంగా ఐదో రోజు లాస్ ఏంజెల్స్ లో పర్యటించిన ఐటీ,పురపాల శాఖ మంత్రి కె.తారకరామారావు, డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. CEO జెఫ్రీ కాట్జన్ బర్గ్ ను కలుసుకున్న కేటీఆర్, ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు గురించి వివరించారు. భారత్ లో విస్తరించే ఆలోచనలు ఉన్నాయన్న జెఫ్రీ, సమర్థ నాయకత్వంలో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. తమ దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. ఇంతేకాదు తమ సినిమాల ప్రమోషన్ కోసం హైఎండ్ ఎకో సిస్టమ్ తో ఒక థియేటర్ ను నిర్మిస్తామని అందుకు సహకరించాలని మంత్రిని జెఫ్రీ కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్, డ్రీమ్ వర్క్స్ కు చేతనైనంత సహాయం చేస్తామని హామి ఇచ్చారు. డ్రీమ్ వర్క్స్ విస్తరణకు అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్ లో నిర్మించే ఫిల్మ్ సిటీ అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు కేటీఆర్. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్ లో చిన్నతరహా థీమ్ సెంటర్, డ్రీమ్ ప్లేను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్ వర్క్స్ ఈ సమావేశంలో నిర్ణయించాయి. హైదరాబాద్ వచ్చి భారత మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించాలని జెఫ్రీని మంత్రి కేటీఆర్ కోరారు. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్ ఇన్నోవేషన్ సెంటర్ క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ ను తారకరామారావు సందర్శించారు. నీటి సంరక్షణతో పాటు మురుగునీటి శుద్దిలో వినూత్నమైన పద్దతులను అవలంబిస్తున్న క్లీన్ టెక్ పనితీరు, విజయవంతమైన తీరును కేటీఆర్ తెలుసుకున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన టీ హబ్ గురించి వివరించి తగిన సహకారం అందించాలని, కలిసి పనిచేయాలని కోరారు. ఇంక్యుబేటర్ సీఈఓను హైదరాబాద్ రావాలని మంత్రి ఆహ్వానించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







