పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం: SR200 మిలియన్ కనీస పెట్టుబడి
- February 05, 2024
రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేటీకరణ చట్టం యొక్క సవరించిన కార్యనిర్వాహక నిబంధనల ప్రకారం.. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్ కోసం కనీస పరిమితి SR 200 మిలియన్లుగా ఉంది. ఆస్తి యాజమాన్య ప్రాజెక్ట్‌ల బదిలీకి కనీస విలువను SR 50 మిలియన్లుగా నిబంధనల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 31, 2023న నేషనల్ సెంటర్ ఫర్ ప్రైవేటైజేషన్ & PPP (NCP) డైరెక్టర్ల బోర్డు చేసిన సవరణలను ఆమోదించిన తర్వాత, సౌదీ అరేబియా అధికారిక గెజిట్ ఉమ్ అల్-ఖురా శుక్రవారం ప్రైవేటీకరణ చట్టం యొక్క సవరించిన నిబంధనల వివరాలను ప్రచురించింది. ప్రైవేటీకరణ సూత్రాలు, ప్రైవేటీకరణ ప్రాజెక్ట్ యొక్క కనీస విలువ, ప్రైవేటీకరణ ప్రాజెక్టులకు సిస్టమ్‌ను వర్తింపజేయడానికి ప్రమాణాలతో సహా 169 ఆర్టికల్స్ ను ఇందులో పొందుపరిచారు. ప్రైవేటీకరణ చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలను రూపొందించే క్రమంలో ప్రైవేటీకరణ ప్రాజెక్టులను అమలు చేయడంలో అంతర్జాతీయ పద్ధతులు, స్థానిక అనుభవాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీనిని అభివృద్ధి చేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. నిబంధనలలో ఆర్టికల్ మూడు.. ప్రైవేటీకరణ ప్రాజెక్ట్ యొక్క కనీస విలువను నిర్దేశిస్తుంది. ఇది లక్ష్య ఆస్తుల కోసం కార్యనిర్వాహక సంస్థ నిర్ణయించిన అంచనా విలువ ఆధారంగా, ఆస్తి యాజమాన్య ప్రాజెక్ట్ యొక్క బదిలీకి కనీస విలువను SR 50 మిలియన్లుగా పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్‌కు కనీస పరిమితి SR200 మిలియన్లు అని నిర్ణయించారు. సౌదీ అరేబియా 2018 లో ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతు ఇవ్వడం, ప్రైవేట్ రంగం పాత్రను మెరుగుపరచడం మరియు అనేక రంగాలలో కేటాయించగల ప్రభుత్వ ఆస్తులు, సేవలు మరియు వనరులను గుర్తించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం సౌదీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి.. వైవిధ్యతకు దోహదం చేస్తుంది. అదే సమయంలో పౌరులకు అనేక అవకాశాలను అందిస్తుంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







