టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..
- February 05, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది టీటీడీ. దీనితో చాలా మంది భక్తులకు ఊరట కలుగుతుంది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇక నుంచి ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఎంబీసీ 34లోని కౌంటర్ దగ్గర టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూలైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టీటీడీ ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఒక లింక్ తో కూడిన మెసేజ్ వస్తుంది. భక్తులు ఆ లింకుపై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు డబ్బులు చెల్లించి.. ఆన్ లైన్ లోనే నగదు చెల్లించి.. టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. టీటీడీ 2 రోజుల నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయం కూడా తీసుకుంది.
తాజా వార్తలు
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీపై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం









