బార్కా, ముసన్నా సౌత్ అల్ బతినాలో 61,449 పక్షుల తొలగింపు

- February 05, 2024 , by Maagulf
బార్కా, ముసన్నా సౌత్ అల్ బతినాలో 61,449 పక్షుల తొలగింపు

ఒమన్: అల్ రుస్తాక్: 2,561 భారతీయ కాకులు,  58,888 ఇతర పక్షులతోసహా దాదాపు 61,449 ఆక్రమణ(ఇన్ వాసీవ్) పక్షులను ఎన్విరాన్‌మెంట్ అథారిటీ తొలగించింది. ఒమన్ సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్‌లలో  అథారిటీ ప్రారంభించిన ప్రచారంలో భాగంగా దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని బార్కా మరియు ముసన్నా విలాయత్‌లలో మైనాస్ తొలగించబడ్డాయి.విలాయత్ ఆఫ్ ముసన్నాలో 34,880 పక్షులు, బర్కాలోని విలాయత్‌లో 26,569 పక్షులను తొలగించినట్లు దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని పర్యావరణ విభాగం పేర్కొంది. సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని పర్యావరణ విభాగం డైరెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ వ్యవస్థలోని ఆక్రమణ పక్షుల సంఖ్యను తగ్గించడానికి పర్యావరణ అథారిటీ ఈ ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఆక్రమణ పక్షులు పర్యావరణంలో అసమతుల్యతకు కారణమవుతుందని, అవి వ్యవసాయ పంటలు, పండ్లు, ధాన్యాల పంటలను దెబ్బతీస్తాయన్నారు.  ఇది ఒమన్ సుల్తానేట్‌లోని ఆర్థిక వనరులు, ఆదాయ వనరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com