జనవరిలో 11 మిలియన్లకు చేరుకున్న ప్రైవేట్ రంగ ఉద్యోగులు

- February 06, 2024 , by Maagulf
జనవరిలో 11 మిలియన్లకు చేరుకున్న ప్రైవేట్ రంగ ఉద్యోగులు

రియాద్: ప్రైవేట్ రంగంలోని మొత్తం కార్మికుల సంఖ్య జనవరి నెలలో దాదాపు 11.054 మిలియన్లకు చేరుకుంది. ఇది చారిత్రాత్మక రికార్డు అని నేషనల్ లేబర్ అబ్జర్వేటరీ (NLO) తన తాజా నివేదికలో వెల్లడించింది.  జనవరి నెలలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సౌదీ పౌరుల మొత్తం సంఖ్య 2.327 మిలియన్లకు చేరుకుందని, వీరిలో పురుషుల సంఖ్య 1.375 మిలియన్లకు చేరుకోగా, మహిళా పౌరుల సంఖ్య 952400గా ఉందని నివేదిక తెలిపింది. మరోవైపు  ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మొత్తం ప్రవాసుల సంఖ్య 8.72 మిలియన్లకు చేరుకుందని, వీరిలో 8.386 మిలియన్ల మంది పురుషులు మరియు 33979 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. 32,447 మంది పౌరులు మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో చేరినందున జనవరి నెలలో పౌరుల ఉద్యోగాలలో నికర వృద్ధిని నివేదిక సమీక్షించింది. ఆర్థిక సంస్కరణలతోనే ఈ వృద్ధి సాధ్యమైందని పేర్కొంది.  నేషనల్ లేబర్ అబ్జర్వేటరీ అనేది 2010లో రాయల్ డిక్రీ ద్వారా స్థాపించబడిన జాతీయ అబ్జర్వేటరీ. ఇది కార్మిక మార్కెట్ డేటాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com