భారత్ రైస్ వచ్చేసింది..

- February 06, 2024 , by Maagulf
భారత్ రైస్ వచ్చేసింది..

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం ఫిబ్రవరి 6న ‘భారత్ రైస్’ని కిలోకు రూ.29 సబ్సిడీతో ప్రారంభించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌‌లో భారత్ రైస్ విక్రయాలను కేంద్రఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.

అంతేకాదు.. భారత్ రైస్ విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను కూడా గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. తొలి దశలో ఈరోజు (మంగళవారం) నుంచి కేంద్రీయ భండార్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) అన్ని భౌతిక, మొబైల్ అవుట్‌లెట్లలో భారత్ రైస్ అందుబాటులో ఉంటుంది.

ఇందుకోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (FBI) సరఫరా చేస్తోంది. సబ్సిడీ బియ్యం 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌లలో వినియోగానికి అందుబాటులో ఉంటుంది. త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో భారత్ రైస్ అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. అన్నం ఎక్కువగా తినే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల ప్రజలకు ఈ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com