దుబాయ్-ఇండియా ప్రయాణంలో పొరబాటు.. భద్రతా ఉల్లంఘన..!

- February 07, 2024 , by Maagulf
దుబాయ్-ఇండియా ప్రయాణంలో పొరబాటు.. భద్రతా ఉల్లంఘన..!

యూఏఈ: ముంబై విమనాశ్రయంలో భారీ భద్రతా ఉల్లంఘన తృటిలో తప్పింది. సోమవారం దుబాయ్ నుంచి ముంబైకి ఎయిర్ విస్తారా విమానంలో వచ్చిన ప్రయాణికులను దేశీయ టెర్మినల్‌కు తీసుకుపోయారు. "ఫిబ్రవరి 4న విస్తారా ఫ్లైట్ యూకే 202లో దుబాయ్ నుండి ముంబైకి చేరుకున్న తమ ప్రయాణికులలో కొందరు, అంతర్జాతీయ టెర్మినల్ కు బదులుగా దేశీయ ప్రయాణికులు రాకపోకలు డొమెస్టిక్ టెర్నినల్ వద్దకు తప్పుగా తీసుకెళ్లబడ్డారు." అని విమాన యాన సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని విమానంలో ఉన్న దుబాయ్ వాసి ఒకరు తెలిపారు. "మేము ముంబైకి వచ్చినప్పుడు, ఏరోబ్రిడ్జికి బదులుగా మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. " అని వినయ్ ఆర్ఎస్ చెప్పారు.  వెంటనే తాము అధికారులను అప్రమత్తం చేయడంతో పొరపాటు జరిగిందని గ్రహించిన తర్వాత, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సహా అధికారులు దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించారని తెలిపారు. ప్రతి ఒక్కరినీ అంతర్జాతీయ రాకపోకల గేట్‌కు తిరిగి తీసుకెళ్లడానికి బస్సులను ఏర్పాటు చేసారని వినయ్ తెలిపారు. అక్కడ, ప్రతి ఒక్కరూ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ద్వారా వెళ్లి సామాను బెల్ట్‌కు వెళ్లినట్లు వివరించారు. ప్రయాణికులు వారి రాక ఫార్మాలిటీలను పూర్తి చేసేందుకు నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్లేలా తమ బృందాలు సెక్యూరిటీ ఏజెన్సీలు, సంబంధిత అధికారులతో కలిసి పనిచేశాయని ఎయిర్ విస్తారా తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com