తూచ్.! నయన తార విషయంలో అదంతా వుత్తదేనట.!
- February 12, 2024
ఇటీవల ‘అన్నపూర్ణ’ సినిమాతో సౌత్ క్వీన్ లేడీ సూపర్ స్టార్ నయన తార చాలా గొడవలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆఖరికి గొడవల్ని తాళలేక.. ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతున్న ఆ సినిమాని నిర్ధాక్షిణ్యంగా రాత్రికి రాత్రే తొలిగించేసిన సంగతి కూడా చాలా మందికి తెలుసు.
ఈ నేపథ్యంలోనే సౌత్ సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు నయన తార దూరమైపోయిందన్న వార్త తెలుగు ప్రేక్షకుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
అందుకు కారణం, ఆమె బాలీవుడ్లో బిజీ అయిపోవడమే. ‘జవాన్’ సినిమాతో నయన తార బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడం.. ఆమెకు బాలీవుడ్లో మరన్ని స్టార్ ఛాన్సెస్ క్యూ కట్టాయ్.
దాంతో, తెలుగు సినిమాల నుంచి నయన తార తప్పుకుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, అదంతా ఫేక్ ప్రచారమనీ, నయన తార అలాంటి డెసిషన్స్ తీసుకోలేదనీ తెలుస్తోంది.
తాజాగా వెంకటేష్ నటిస్తున్న ఓ సినిమాకి నయన తార సైన్ చేసిందనీ తెలుస్తోంది. అలాగే, చిరంజీవి సినిమా ఒకటి నయన్ కోసం చర్చల దశలో వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







