ఒమన్‌లో మొదటి ప్రభుత్వ ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభం
- February 15, 2024
మస్కట్: ఒమన్‌లో మొదటి ప్రభుత్వ ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభమైంది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ అలీ అల్-సబ్తీ, సామాజిక అభివృద్ధి మంత్రి హెచ్.ఇ. డా. లైలా అహ్మద్ అల్-నజర్, సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ఛాన్సలర్ డా. మునా ఫహాద్ మహమూద్ అల్ సెయిద్ లు ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. అల్ వత్తయా ప్రసూతి మరియు గైనకాలజీ కాంప్లెక్స్‌లోని సంతానోత్పత్తి కేంద్రం ప్రభుత్వ ఆరోగ్య రంగంలో మొట్టమొదటిది. సంతానోత్పత్తి సమస్యలకు చికిత్స చేయడంలో దంపతులకు వారి ప్రయాణంలో వైద్య కేంద్రం రోగనిర్ధారణ మరియు చికిత్సా సేవలను అందిస్తుంది. ఖౌలా హాస్పిటల్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ అత్యాధునిక ల్యాబ్ టెక్నాలజీలను కలిగి ఉంది. మెటర్నిటీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రహ్మా అల్-ఘబ్షి మాట్లాడుతూ.. 10 నుండి 13 శాతం మంది ప్రెగ్నేన్సీ సమస్యలతో బాధపడుతున్నారని, ఇది వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









