ఒమన్‌లో భారీ వర్షాలు.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
- February 15, 2024
మస్కట్: సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఒమన్ లో ముగ్గురు పిల్లలు, ఒక మహిళతో సహా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రుస్తాక్‌లోని వాడి బానీ గఫీర్లో ముగ్గురు చిన్నారులు మునిగి చనిపోగా, ఇజ్కీలోని విలాయత్‌లో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. యాన్కుల్లోని వాడి ఘయ్యాలో మరొక వ్యక్తి చనిపోగా, జబల్ అఖ్దర్లో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యాన్కుల్లో ఒకరు, జబల్ అఖ్దర్లో మరొకరు తప్పిపోయినట్లు సమాచారం. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ), సహాయక మరియు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఒమన్‌లోని వివిధ ప్రాంతాలలో దాదాపు 200 మందిని సురక్షితంగా రక్షించినట్లు సిడేఎఎ తెలిపింది.
అల్ దఖిలియా గవర్నరేట్‌లో లోయలను దాటేందకు యత్నించిన 36 మందిని అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, లోయలు దాటడం ప్రమాదకరమని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సిడిఎఎ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ









