యూఏఈ-ఒమన్ టూరిజం.. వీసా నిబంధనలు సడలింపు
- February 15, 2024
యూఏఈ: సరిహద్దులు లేని ప్రయాణం కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత యూఏఈ-ఒమన్ మధ్య ప్రయాణం ఇప్పుడు వేగవంతమైంది. రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ (RAKTDA) మరియు ఒమన్ టూరిజం డెవలప్‌మెంట్ కంపెనీ (ఒమ్రాన్ గ్రూప్), ఒమన్‌లోని ముసందమ్ గవర్నరేట్ మధ్య పర్యాటకాన్ని పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రస్ అల్ ఖైమా సరిహద్దులో ఉన్న ముసందమ్ యూఏఈ నివాసితులకు నీటి సాహస క్రీడలను కోరుకునే పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. “ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా మెరుగైన రవాణా సంబంధాలు, అంతర్జాతీయ పర్యాటకులకు అనుకూలమైన వీసా ఏర్పాట్లు, ప్రత్యేకమైన పర్యాటక ప్యాకేజీల ద్వారా క్రాస్-డెస్టినేషన్ టూరిజంను మెరుగుపరచడం రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ”అని RAK టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ రాకీ ఫిలిప్స్ అన్నారు. నవంబర్ 2023లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లండన్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. యూఏఈ నివాసితులు ఒమన్‌కు రాకముందే ఆన్‌లైన్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఆన్ అరైవల్ వీసా పొందే ఎంపిక కూడా అందుబాటులో ఉందన్నారు. ఏకీకృత GCC టూరిస్ట్ వీసా ఇటీవల ఆమోదించామని, ఇది ఒకసారి అమలులోకి వస్తే గల్ఫ్-సభ్య దేశాలలో ప్రయాణాన్ని మరింత సులభతరం అవుతుందన్నారు. 2023లో నార్తర్న్ ఎమిరేట్ రికార్డు స్థాయిలో 1.22 మిలియన్ ఓవర్‌నైట్ విజిటర్స్ ను నమోదు చేసిందన్నారు. 2022తో పోల్చితే పెరుగుదల రేటు 8 శాతం గా ఉందని, అంతర్జాతీయ సందర్శకులలో సంవత్సరానికి 24 శాతం పెరుగుదలను సాధించిందన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







