‘ఊరు పేరు భైరవ కోన’ ఇంతటితో ఆగేది కదా.?
- February 15, 2024సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఇప్పటికే మంచి మౌత్ టాక్ నడుస్తోంది. ప్రమోషన్లు బాగున్నాయ్.
ప్రచార చిత్రాలూ పాజిటివ్‌గా వున్నాయ్. వాయిదాల పర్వం ముగించుకుని ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది. ‘ఊరు పేరు భైరవకోన’ ఇంతటితో ఆగే సినిమా కాదు. ఈ సినిమాకి సీక్వెల్‌తో పాటూ, ప్రీక్వెల్ కూడా వుందని చిత్ర నిర్మాత చెబుతున్నారు.
అలాగని ఈ సినిమాని సగంలో ఆపేసిసట్లు.. క్లైమాక్స్‌లో లీడ్ ఇచ్చి అసంపూర్తిగా వదిలిపెట్టలేదని సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తికరంగా ధియేటర్ల నుంచి బయటికి వస్తారనీ తెలిపారు.
పురాణాల్లోని ఓ ముఖ్యమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.. అని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి ప్రాణంగా కనిపిస్తుంది. చూడాలి మరి, సందీప్ కిషన్‌కి ఈ సినిమా అయినా అచ్చొస్తుందో లేదో.!
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు