సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలో ఉగ్రదాడి..
- June 02, 2016
సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బుధవారం సాయంత్రం బాంబు దాడులుకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు సాయుధులు బాంబు దాడి చేయడంతో పాటు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మృతులలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారని సోమాలియా అధికారులు గురువారం ప్రకటించారు. కాల్పులు జరిగిన తర్వాత హోటల్ తాత్కాలికంగా మూసివేసిన అధికారులు గురువారం కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.హోటల్ కొందరు కాల్పులు జరపగా, మరొందరు దుండుగులు హోటల్ ముందు ఉన్న స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హోటల్ ముందు బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది.తొమ్మిది మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని, ప్రస్తుతం అక్కడ దుండుగులు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు సాయుధులను మట్టుపెట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







