'ఖతార్ 1812 కిమీ' అధికారిక స్పాన్సర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్‌

- February 19, 2024 , by Maagulf
\'ఖతార్ 1812 కిమీ\' అధికారిక స్పాన్సర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్‌

దోహా: ఖతార్ ఎయిర్‌వేస్ 'ఖతార్ 1812 కిమీ' FIA వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్‌కు అధికారిక స్పాన్సర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్‌ను లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (LIC) ప్రకటించింది. 2024లో 12వ సీజన్ కోసం ఖతార్ ఎయిర్‌వేస్ FIA వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ (WEC)తో చేతులు క‌లిపాయి.  ఫిబ్రవరి 29 నుండి మార్చి 2 వరకు ఐకానిక్ లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో సీజన్ ఓపెనర్‌కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. 10 గంటల కంటే తక్కువ నిడివి గల ఈ రేస్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ ఖతార్ 1812 కిమీ అని పేరు పెట్టిన‌ట్లు ఖతార్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తియరీ ఆంటినోరి తెలిపారు.  FIA వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ సీఈఓ ఫ్రెడెరిక్ లెక్వియన్ మాట్లాడుతూ..  ఖ‌తార్ ఎయిర్‌వేస్ కతార్ 1812 కిమీ ప్రారంభోత్సవానికి మా టైటిల్ స్పాన్సర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్ ఆన్‌బోర్డ్‌ను స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు. ప్రపంచ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ నాలుగు ఖండాలలో విస్తరించి ఉన్న ఎనిమిది దేశాలలో ఉత్కంఠభరితమైన అనుభ‌వాన్ని అందించ‌నుంది. ఉత్తేజకరమైన సీజన్‌లో భాగంగా ఛాంపియన్‌షిప్‌లో ఆల్పైన్, ఆస్టన్ మార్టిన్, బిఎమ్ డ‌బ్ల్యూ, కాడిలాక్, కొర్వెట్టి, ఫెరారీ, ఫోర్డ్, ఇసోటా ఫ్రాస్చిని, లంబోర్ఘిని, లెక్సస్, మెక్‌లారెన్ పాల్గొంటున్నాయి. మొత్తంమీద ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో 19 హైపర్‌కార్లు,   18 LMGT3 సండ‌ది చేయ‌నున్నాయి.  ఏడుసార్లు MotoGP ప్రపంచ ఛాంపియన్ అయిన వాలెంటినో రోస్సీ LMGT3లో టీమ్ త‌ర‌ఫున‌ పోటీ ప‌డుతున్నాడు. 2009లో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌గా పట్టాభిషేకం చేసిన జెన్సన్ బటన్ కూడా రేసులో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com