లాస్ ఏంజిల్స్‌లో 'మెగాస్టార్' చిరంజీవికి ఘన సన్మానం!

- February 19, 2024 , by Maagulf
లాస్ ఏంజిల్స్‌లో \'మెగాస్టార్\' చిరంజీవికి ఘన సన్మానం!

అమెరికా: కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మవిభూషణుడు చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించగా.. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా ఘనంగా సన్మానించారు.

అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ను ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ‘పద్మ విభూషణ్’ గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి.. శాలువాలతో చిరుకి తెలుగు ఫాన్స్, మెగా ఫాన్స్ సన్మానం చేశారు. తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. తనపై కురిపిస్తున్న ఈ ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com