పిల్లల వ‌ద్ద‌ పొగతాగుతున్నారా? Dh5,000 కంటే ఎక్కువ జరిమానా..!

- February 20, 2024 , by Maagulf
పిల్లల వ‌ద్ద‌ పొగతాగుతున్నారా? Dh5,000 కంటే ఎక్కువ జరిమానా..!

యూఏఈ: య‌ఏఈలోని నివాసితులలో ధూమపానం అల‌వాటు అధికం.ఇ-సిగరెట్లు మరియు వేప్‌ల రాక‌తో ధూమపానం చేసేవారి సంఖ్య పెరుగుతోంది.  మ‌రోవైపు పొగాకు సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు వాటిని ఉపయోగించడం సులభం అయింది. యూఏఈలోని నిపుణుల ప్ర‌కారం.. ధూమపానం చేయని వ్యక్తులు ధూమపానం చేసే వ్యక్తులతో సమానమైన ఆరోగ్య ప్రభావాలను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కూడా వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది చ‌నిపోతున్నారు. ఇందులో పొగతాగే అలవాటు లేని 1.3 మిలియన్ల మంది పొగతాగేవారి పొగకు బ‌ల‌వుతున్నారు.  యూఏఈలో పిల్లల చుట్టూ ధూమపానాన్ని ఎదుర్కోవడానికి కఠినమైన చ‌ట్టాల‌ను ఏర్పాటు చేసింది. అలాగే మైనర్లకు పొగాకు సంబంధిత ఉత్పత్తులను అమ్మ‌టంపై నిషేధం ఉంది.
దేశంలో బాలల హక్కులను స్థాపించే వడీమా చట్టం ప్రకారం పిల్లల సమక్షంలో ధూమపానం చేయడంపై నిషేధం ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సమక్షంలో ఏదైనా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రవాణా మార్గాలలో ధూమపానం చేయడం ఖచ్చితంగా నేరం అవుతుంది. చ‌ట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5,000 దిర్హామ్‌లకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించే లేదా విక్రయించడానికి ప్రయత్నించే వ్యక్తులకు కనీసం 3 నెలల జైలు శిక్ష మరియు/లేదా Dh15,000 కంటే తక్కువ జరిమానా విధించబడుతుంది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com