'సౌదీపీడియా' డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభం

- February 20, 2024 , by Maagulf
\'సౌదీపీడియా\' డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభం

రియాద్: సౌదీ మీడియా ఫోరమ్ కార్యకలాపాల్లో భాగంగా రియాద్‌లోని ఫ్యూచర్ ఆఫ్ మీడియా ఎగ్జిబిషన్ (ఫోమెక్స్)లో సౌదీ మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ సోమవారం 'సౌదీపీడియా' డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహాతో పాటు అరబ్,  అంతర్జాతీయ మీడియా సంస్థల నుండి వివిధ అధికారులు పాల్గొన్నారు. విజన్ 2030 కింద హ్యూమన్ కెపాబిలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగమైన 'సౌదీపీడియాస సౌదీకి సంబంధించిన సమగ్ర జ్ఞాన సూచనగా ఉపయోగపడుతుంది. మ‌ల్టీ భాషల్లో సౌదీ అరేబియా గురించిన సమాచారం అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా మంత్రి అల్-దోసరీ మాట్లాడుతూ.. 'సౌదీపీడియా' ప్రపంచానికి సౌదీ స‌మాచారాన్ని అందిస్తుంద‌న్నారు. అరబిక్‌తో ప్రారంభించి బహుభాషా వేదిక ద్వారా సౌదీ నాయకత్వం, ప్రజలు, చరిత్ర, భౌగోళికం మరియు సంస్కృతిని ప్రదర్శిస్తుందని తెలిపారు. 'సౌదీపీడియా' సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక మరియు చారిత్రక అంశాల నుండి రాజ్యం  వాస్తవికతను ప్రతిబింబించే ఎన్సైక్లోపెడిక్ కంటెంట్‌ను అందిస్తుందని వివ‌రించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com