దుబాయ్ జైలు నుంచి ఐదుగురు తెలంగాణవాసుల విడుదల
- February 21, 2024
హైదరాబాద్: దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. ఓ హత్యకేసులో 18ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత పదేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు శిక్షను 25 ఏళ్లకు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి .. హతుని కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా.. మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు.
అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి ప్రయత్నించారు. దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది. దీంతో దుబాయ్ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ వచ్చారు. 18ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







