ఇండియాతో ఎంఓయు, డ్రాఫ్ట్ అగ్రిమెంట్లకు క్యాబినెట్ ఆమోదం
- June 02, 2016
ఖతార్ మరియు భారతదేశాల మధ్య పలు ఒప్పందాలు, అగ్రిమెంట్లకు సంబంధించి క్యాబినెట్ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, ఖతార్‌లో పర్యటించిన దరిమిలా ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనితో జరిగిన చర్చల ఫలితంగా కుదిరిన ఒప్పందాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కస్టమ్స్ సంబంధిత విషయాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం ఇందులో కీలకమైనది. అలాగే, హెల్త్ మరియు టూరిజం రంగాల్లో ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం మరో కీలక అంశం. మనీ లాండరింగ్, తీవ్రవాదానికి ఆర్థిక సహాయం, దానికి సంబంధించిన నేరాలు తదితర అంశాలపైనా ఇరు దేశాల మధ్యా అవగాహన ఒప్పందం కుదిరింది. యువత మరియు క్రీడలకు సంబంధించిన పలు ఒప్పందాలు కూడా ఈ సందర్భంగా జరిగాయి. స్కిల్ డెవలప్‌మెంట్, టూరిజం మరియు కస్టమ్స్ విభాగాలకు సంబంధించి భారత క్యాబినెట్ కూడా నిన్ననే పలు ఒప్పందాలకు ఆమోద ముద్ర వేయడం జరిగింది
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







