హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ డ్రాప్ట్‌ చట్టానికి తుదిరూపు

- June 02, 2016 , by Maagulf
హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ డ్రాప్ట్‌ చట్టానికి తుదిరూపు

మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంఓపిహెచ్‌), కొత్త హెల్త్‌ ఇన్య్స్యూరెన్స్‌ సిస్టమ్‌కి సంబంధించి డ్రాఫ్ట్‌ చట్టానికి తుది రూపాన్నిచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా రూపొందే ఇన్స్యూరెన్స్‌ సిస్టమ్‌తో స్థానికులు లబ్ది పొందుతారు. 2017లో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. మినిస్ట్రీ ఈ డ్రాఫ్ట్‌ చట్టాన్ని క్యాబినెట్‌కి ఈ నెలలోనే పంపనుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ కింద ఓ కమిటీని ఏర్పాటు చేసి, ప్రైవేటు ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు సంబంధించి టెండర్‌ ప్రక్రియల్ని పూర్తి చేయాల్సిందిగా ఆదేశించింది. హెల్త్‌ ఫైనాన్సెస్‌ మరియు ఇన్స్యూరెన్స్‌ అనే విభాగాన్ని తయారుచేసేందుకుగాను మినిస్ట్రీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ మెంబర్స్‌ ద్వారా ఈ కొత్త విధానంపై తమ సూచనలు, సలహాలు తెలియజేసేందుకు వీలుగా ఎఓపిహెచ్‌ అతి త్వరలో ఓ క్వశ్చనీర్‌ని కూడా విడుదల చేయనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com