అబుదాబీ, దుబాయ్‌ని కలిపేందుకు కొత్త హైవే
- June 02, 2016
ఈ ఏడాది చివరినాటికి వాహనదారులకు దుబాయ్ మరియు అబుదాబీలను కలిపే హైవేపైకి అనుమతినివ్వనున్నారు. 62 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైవే రెండు వైపులా నాలుగు లేన్లను కలిగి ఉంటుంది. నిర్మాణ పనులు 83 శాతం పూర్తయ్యాయని అబుదాబీ జనరల్ సర్వీసెస్ కంపెనీ (ముసానదా) వెల్లడించింది. సెయిహ్ షుయైబ్ నుంచి అబుదాబీ మీదుగా ఈ హైవే ప్రారంభమవుతుంది. ఫారెస్ట్ బెల్ట్, అల్ మహా ఫారెస్ట్, కిజాద్, ఖలీఫా సిటీ, అల్ అజ్బాన్ రోడ్.. ఇలా సాగుతుంది ఈ హైవే మీద ప్రయాణం. 1.2 బిలియన్ దిర్హామ్‌లు వెచ్చించి ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఈ హైవే పై ఆరు ఇంటర్‌ఛేంజెస్, ఆరు అండర్‌గ్రౌండ్ పాసెస్ ఉన్నాయి. గంటకు 8000 వాహనాల కెపాసిటీతో, 2000 వాహనాలు ప్రతి లేన్‌పై వెళ్ళే సామర్థ్యంతో ఈ హైవేని రూపొందించారు. అబుదాబీ మరియు దుబాయ్ మధ్య ప్రయాణానికి ఈ హైవే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







