ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం పూర్తి..సాయంత్రం అంత్యక్రియలు

- February 23, 2024 , by Maagulf
ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం పూర్తి..సాయంత్రం అంత్యక్రియలు

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీ కొట్టడంతో.. తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు.

దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. శవపరీక్ష పూర్తి చేసిన వైద్యులు.. ఆమె భౌతికఖాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తరలించనున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ విజయా రెడ్డి ప్రస్తుతం గాంధీ దవాఖాన వద్ద ఉన్నారు. అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ నేతలు తగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com