'సహెల్'లో బయోమెట్రిక్ బుకింగ్

- February 24, 2024 , by Maagulf
\'సహెల్\'లో బయోమెట్రిక్ బుకింగ్

కువైట్: పౌరులు మరియు ప్రవాసులు ఇప్పుడు తమ బయోమెట్రిక్ వేలిముద్రల కోసం నేరుగా సాహెల్ అప్లికేషన్ ద్వారా అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చని అహెల్ యాప్ అధికారిక ప్రతినిధి యూసెఫ్ కజెమ్ తెలిపారు. వారు నావిగేషన్ మెనులోని “అపాయింట్‌మెంట్‌లు” విభాగం ద్వారా బుకింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌వ‌చ్చ‌ని వివ‌రించారు. “బుక్ ఏ అపాయింట్‌మెంట్” నుండి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎంచుకోవాల‌ని, ఆ తర్వాత క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ను ఎంచుకోవాల‌ని,  చివ‌ర‌గా “బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్”ను ఎంచుకోవాల‌ని సూచించారు.  విజయవంతమైన బుకింగ్ తర్వాత వినియోగదారులు బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియ కోసం వచ్చిన స‌మ‌యంలో “కువైట్ మొబైల్ ID” అప్లికేషన్ లేదా పౌర IDకి రిమైండర్‌తో పాటు నిర్ధారణ నోటిఫికేషన్‌ను అందుకుంటారని తెలిపారు. అంతకుముందు, పౌరులు మరియు నివాసితులందరూ బయోమెట్రిక్ వేలిముద్రలను రాబోయే మూడు నెలల్లో పూర్తి చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com