వ్య‌క్తి ఆచూకీ కోసం.. 10 రోజులుగా కొన‌సాగుతున్న సెర్చ్ ఆప‌రేష‌న్

- February 24, 2024 , by Maagulf
వ్య‌క్తి ఆచూకీ కోసం.. 10 రోజులుగా కొన‌సాగుతున్న సెర్చ్ ఆప‌రేష‌న్

మస్కట్: అల్ జబల్ అల్ అఖ్దర్, అల్ దఖిలియా గవర్నరేట్ విలాయత్‌లో తప్పిపోయిన రెండవ వ్య‌క్తి కోసం సెర్చ్ ఆప‌రేష‌న్ కొనసాగుతుంది. గ‌త ప‌ది రోజులుగా సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ)  సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు నిరాంత‌రాయంగా ఆప‌రేష‌న్ లో పాల్గొంటున్నాయి. ఇద్దరు వ్యక్తులతో అల్ జబల్ అల్ అఖ్దర్‌లోని విలాయత్‌లోని లోయలో వాహనం డ్రిఫ్టింగ్ అయిన విష‌యం తెలిసిందే.  అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ నుండి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఒక వ్యక్తిని అనంత‌రం గుర్తించాయి. గ‌ల్లంతైన మ‌రో వ్య‌క్తి ఆచూకీ కోసం సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com