సెలవులకు ఇండియా వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి

- February 26, 2024 , by Maagulf
సెలవులకు ఇండియా వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి

దుబాయ్: భారతదేశంలో తన తోబుట్టువుల రెండు వివాహాలను జరుపుకున్న తర్వాత, శుక్రవారం దుబాయ్‌లో దిగిన జోబిన్ బాబు వర్గీస్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫిబ్రవరి 23న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వారి ఇంటికి వెళుతుండ‌గా వారి కారు ఘోరమైన ప్రమాదానికి గురైంది. జాబిన్ 5 ఏళ్ల కుమార్తె నవోమి జోబిన్ బాబు ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న జాబిన్ సోదరుడు కేరళలో సెలవుల అనంతరం విమానాశ్రయం నుంచి కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నవోమితో పాటు ఆమె సోదరుడు నాథన్ జాబిన్, ఆమె అక్క నోవా జాబిన్, వారి తల్లి సోబిన్ ఉన్నారు.  "మా కారు టైర్ అకస్మాత్తుగా పగిలింది. స్టీరింగ్ వీల్ అదుపు తప్పింది. వాహనం బోల్తా పడింది." అని బాలిక తండ్రి తెలిపాడు. షార్జా వైపు వెళుతున్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ (ఈ311)లో ట‌ర్నింగ్ అవుతుండగా రషీదియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  కారులో ఉన్న ఇతరుల‌కు స్వల్ప గాయాలయ్యాయి.  యూఏఈలో పెరిగిన జాబిన్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్నారు. షార్జాలో తన కుటుంబంతో నివసిస్తున్నారు. నవోమి షార్జా ఇండియన్ స్కూల్‌లో కిండర్ గార్టెన్‌లో చదువుతున్న‌ది.  బుధవారం జెబెల్ అలీలో అంత్యక్రియలు నిర్వహించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com