హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..
- February 26, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా… మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో బీజేపీ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరిని నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు… డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి సదరు నేత బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ హోటల్ కూడా ఆయనదేనని సమాచారం. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం.ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







