మార్చి 11 నుండి రమదాన్ 2024 ప్రారంభం..!
- February 27, 2024
యూఏఈ: అంతర్జాతీయ ఖగోళ కేంద్రం ప్రకటన ప్రకారం.. చాలా ఇస్లామిక్ దేశాలలో రమదాన్ మార్చి 11 న ప్రారంభమవుతుంది. సూర్యుడు - చంద్రుని మధ్య కంజక్షన్ మార్చి 10న GMT ఉదయం 9 గంటలకు జరుగుతుంది. అయితే, మార్చి 10వ తేదీన చంద్రుడిని చూడటం అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచంలో ఎక్కడి నుండైనా కంటితో లేదా టెలిస్కోప్ ఉపయోగించి సాధ్యం కాదని ఆ ప్రకటన పేర్కొంది. మార్చి 10న ఇస్లామిక్ ప్రపంచంలోని నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు అస్తమిస్తాడని, ఆరోజున చంద్రుడు కనిపించేందుకు అనువైన వాతావరణం లేదని ఇంటర్నేషనల్ ఖగోళ శాస్త్ర కేంద్రం డైరెక్టర్ ఇంజనీర్ ముహమ్మద్ షౌకత్ ఓదే తెలిపారు. అందువల్ల చాలా దేశాలు మార్చి 11న నెలవంకను చూస్తాయని, రమదాన్ మార్చి 12న ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మార్చి 11న సూర్యాస్తమయం తర్వాత దాదాపు 15-25 నిమిషాలకు పశ్చిమ హోరిజోన్‌కు దగ్గరగా కంటితో చంద్రవంకను సులభంగా చూడవచ్చని ఒదేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







