అంతర్జాతీయ సలుకీ డాగ్ షో విజయవంతం
- February 27, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ విలేజ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ అరేబియన్ సలుకీ డాగ్ షో సందర్శకులను ఆకట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలలో 80 మంది అద్భుతమైన సలుకీలను ప్రదర్శించారు. అబుదాబి నుండి పాల్గొన్న అలెగ్జాండ్రా సుల్లివన్ నిర్వాహకులకు తన అభినందనలు తెలియజేసింది. బహ్రెయిన్ రావడం ఇది మొదటిసారని పేర్కొంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లను నిర్వహించడంలో బహ్రెయిన్ నిబద్ధతతో తనను ఆకట్టుకుందని తెలిపారు. అలెగ్జాండ్రా సలుకీ బెస్ట్ మేల్, బెస్ట్ ఇన్ షో సుప్రీం మరియు అత్యున్నత మొత్తం గౌరవంతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నది. ప్రఖ్యాత అంతర్జాతీయ డాగ్ షో న్యాయనిర్ణేత షరోన్ లిటిల్ చైల్డ్ సంప్రదాయాలను పరిరక్షించడంలో మరియు సాంస్కృతిక విలువలను ప్రోత్సహించడంలో బహ్రెయిన్ ప్రయత్నాలను ప్రశంసించారు. ఈవెంట్ లో పాల్గొన్న వారందరికి బహ్రెయిన్ ట్రెడిషనల్ స్పోర్ట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తారెక్ జుమా సేలం ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







