ఇజ్రాయిల్, లెబనాన్‌ల మధ్య తీవ్రమైన దాడులు
- February 27, 2024
బీరుట్: ఇజ్రాయిల్, లెబనాన్‌ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్ ప్రయోగించిన డ్రోన్‌ను లెబనాన్ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది.
దక్షిణ లెబనాన్‌లోని ఇక్లిమ్ అల్ -తుఫా నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి గగనతలం క్షిపణితో కూల్చివేసినట్లు హిజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది.ఇజ్రాయిల్ దురాక్రమణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
అయితే ఈ ప్రకటనను ఇజ్రాయిల్ అధికారులు తిరస్కరించారు.డ్రోన్‌ను కూల్చివేయడం అంటే అది 'అద్భుత చర్య' అవుతుందని అన్నారు. ప్రతిచర్యగా ఇజ్రాయిల్ బీకా వ్యాలీ, మజదీల్ నగరంపై బాంబులతో దాడికి దిగింది. ఈ దాడిలో సుమారు నలుగురు మరణించారు. అగ్నిప్రమాదంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తినష్టం జరిగింది. టైర్ నగరంపై హిజ్బుల్లా బాంబుదాడితో హసన్ హుస్సేన్ సలామీని హత్య చేసినట్లు ఇజ్రాయిల్ ఆరోపణలతో లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులను వేగవంతం చేసింది.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







