యూఏఈలో వెస్టియన్ కార్యకలాపాలు ప్రారంభం

- March 01, 2024 , by Maagulf
యూఏఈలో వెస్టియన్ కార్యకలాపాలు ప్రారంభం

దుబాయ్: ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన వెస్టియన్.. మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (MEA) కోసం దుబాయ్‌లో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. మధ్యప్రాచ్యంలో డైనమిక్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో తన సేవల విస్త‌ర‌ణ‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని వెస్టియన్ సీఈఓ శ్రీని రావు తెలిపారు. పెట్టుబడిదారులకు సమగ్ర పరిష్కారాలను అందించే ప్రత్యేక రియల్ ఎస్టేట్ సలహా సంస్థగా పనిచేస్తుందన్నారు. దుబాయ్ లోని  వెస్టియన్ MEA ప్రధాన కార్యాలయం ద్వారా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (MEA) ప్రాంతంలో సేవ‌లు  అందిస్తామ‌ని వెస్టియన్ ఛైర్మన్ మైఖేల్ సిల్వర్ పేర్కొన్నారు. వెస్టియన్ మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (MEA) ప్రాంతంలో వ్యూహాత్మక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీని కోరుకునే పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంద‌ని వెస్టియన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సరీన్ తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com