అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు కేంద్రంగా సౌదీ అరేబియా
- March 01, 2024
రియాద్: సౌదీ అరేబియాలో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించడానికి ఇప్పటివరకు 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు లైసెన్స్ పొందారని, వీరిలో ఎక్కువ మంది రియాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారని మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ తెలిపారు. రియాద్‌లో గురువారం జరిగిన హ్యూమన్ కెపాసిటీ ఇనీషియేటివ్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు కేంద్రంగా చాలా మంది పెట్టుబడిదారులు సౌదీని ఎంచుకున్నారని, లైసెన్సులు పొందిన 450 మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలో అంతర్జాతీయ పెట్టుబడుల కోసం లైసెన్సుల సంఖ్య ప్రారంభంలో 3,000 నుండి 30,000 వ్యాపార లైసెన్సులకు పెరిగిందని అల్-ఫాలిహ్ వెల్లడించారు. అదే సమయంలో భవిష్యత్ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వర్క్‌ఫోర్స్ తమకు కావాలని పెట్టుబడిదారులు అడుగుతున్నారని మంత్రి వివరించారు. ఈ దశాబ్దంలోనే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు $3 ట్రిలియన్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించదన్నారు. ఈ పెట్టుబడులలో ఎక్కువ భాగం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, ఆర్థిక మరియు వృత్తిపరమైన సేవల వంటి కొత్త ఆర్థిక రంగాలు ఉన్నాయని అల్-ఫాలిహ్ చెప్పారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









