శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్..!
- March 01, 2024
హైదరాబాద్: బెంగళూరులో బాంబు పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పలుచోట్ల పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంఘటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సీఐఎస్ఎఫ్, ఎయిర్ పోర్టు ఇంటెలిజెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ఎయిర్పోర్ట్ విలేజ్‌లో తనిఖీలు జరిపారు. ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రతి ప్రయాణికుని సెక్యూరిటీ ఆధికారులు క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి ప్రయాణికుడి లగేజీ బ్యాంగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి అనుమతిస్తున్నారు.
అదేవిధంగా, హైదరాబాద్ నగరంలోని జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అలాగే, రద్దీ ప్రాంతాలతో పాటు షాపింగ్ మాల్స్‌లలో ముమ్మర తనిఖీలు చేశారు. కొన్నిచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానాస్పద వాహనాలను సైతం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
బెంగళూరులో పేలుడు.. 9మందికి తీవ్రగాయాలు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై జాతీయ దర్యాప్తు బృందం సోదాలు చేస్తోంది. ఒక బ్యాగులో తీసుకొచ్చిన పదార్థాలే పేలుడికి దారితీసినట్టు సమాచారం.
గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీతో గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఒక బ్యాగ్‌ను హోటల్లో వదిలివెళ్లినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025